కరీంనగర్-హసన్‌పర్తి రైల్వేలైన్‌కు అనుమతివ్వండి
ABN , Publish Date - Sep 11 , 2024 | 05:24 AM
కరీంనగర్-హసన్‌పర్తి కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైందని, నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
రైల్వే మంత్రికి బండి సంజయ్ వినతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : కరీంనగర్-హసన్‌పర్తి కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైందని, నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. మంగళవారం ఢిల్లీలో అశ్వినీ వైష్ణవ్‌ను బండి సంజయ్ కలిసి వినతిపత్రం అంజేశారు. కరీంనగర్ నుంచి హసన్‌పర్తి వరకు 61.8 కి.మీ. మేర నిర్మించనున్న కొత్త రైల్వేలైన్‌కు రూ.1415 కోట్లు వ్యయమవుతుందని, ఈ మేరకు డీపీఆర్ సిద్ధమైందని తెలిపారు. రైల్వే బోర్డులో ఈ అంశం పెండింగ్‌లో ఉందని, తక్షణమే ఆమోదం తెలపాలని కోరారు. దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ రైల్వే ేస్టషన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని, జమ్మికుంట ేస్టషన్ వద్ద దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఉప్పల్ స్టేషన్ అప్‌గ్రేడ్‌లో భాగంగా ప్లాట్ ఫాం, రైల్వేస్టేషన్ భవనాన్ని ఆధునీకరించాలని, కొత్త రైల్వే సేవలను ప్రవేశపెట్టాలన్నారు. సోలార్ ప్యానెళ్లను అమర్చాలని, టికెట్ కౌంటర్, లగేజీ నిర్వహణ వ్యవస్థను మెరుగుపర్చాలని, అలాగే, ఉప్పల్ రైల్వేస్ట్టేషన్ ఆధునీకరణకు నిధులివ్వాలని కోరారు.