Share News

నాపై అక్రమాస్తుల ఆరోపణలు నిరాధారం

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:50 AM

తనకు రూ.వేల కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నాయంటూ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్‌ చేసిన ఆరోపణలపై టీఎ్‌సపీఎ్‌ససీ చైర్మన్‌, మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. ఆ ఆరోపణలన్నీ నిరాధారం, సత్యదూరమని ఆయన తేల్చిచెప్పారు.

నాపై అక్రమాస్తుల ఆరోపణలు నిరాధారం

36 సంవత్సరాల సర్వీసులో నాది క్లీన్‌ రికార్డ్‌

తప్పుడు ఆరోపణలు చేసేవారిపై క్రిమినల్‌ చర్యలు

టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ మహేందర్‌ రెడ్డి హెచ్చరిక

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): తనకు రూ.వేల కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నాయంటూ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్‌ చేసిన ఆరోపణలపై టీఎ్‌సపీఎ్‌ససీ చైర్మన్‌, మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. ఆ ఆరోపణలన్నీ నిరాధారం, సత్యదూరమని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తనపై బురదజల్లేందుకే ఈ తప్పుడు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పోలీసు శాఖలో 36 సంవత్సరాలకు పైగా అంకితభావంతో, ఎలాంటి మచ్చా లేకుండా పనిచేశానని.. తన సర్వీసు మొత్తం క్లీన్‌ రికార్డు ఉందని గుర్తుచేశారు. అలాంటి తనపై ఇలా ఇప్పుడు అసత్య ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ ఆరోపణలు చేస్తున్నవారిపై, సోషల్‌ మీడియాలో దీనిని వైరల్‌ చేస్తున్నవారిపై క్రిమినల్‌ పరువునష్టం దావా వేస్తానని మహేందర్‌ రెడ్డి హెచ్చరించారు.

Updated Date - Feb 07 , 2024 | 04:50 AM