Share News

Manchiryāla- ప్రజలందరికీ సమాన విద్య అందాలి

ABN , Publish Date - May 15 , 2024 | 10:24 PM

దేశ ప్రజలందరికి సమాన విద్య అందాలని డెమోక్రటీక్‌ టీచర్స్‌ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి లింగారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓప్రైవేటు హాలులో బుధవారం మంచిర్యాలజిల్లా శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన సదస్సులో రాష్ట్ర అకాడమిక్‌ సెల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ బి.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్వి శామ్యూల్‌తో కలిసి పాల్గొన్నారు.

Manchiryāla-        ప్రజలందరికీ సమాన విద్య అందాలి
మాట్లాడుతున్న డీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి

ఏసీసీ, మే 15: దేశ ప్రజలందరికి సమాన విద్య అందాలని డెమోక్రటీక్‌ టీచర్స్‌ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి లింగారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓప్రైవేటు హాలులో బుధవారం మంచిర్యాలజిల్లా శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన సదస్సులో రాష్ట్ర అకాడమిక్‌ సెల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ బి.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్వి శామ్యూల్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా విధానం 2020 అశాస్ర్తీయంగా ఉందన్నారు. మతాన్ని ప్రోత్సహిస్తూ పేద వారికి ఒక రకమైన విద్య, డబ్బున్న వారికి మరో విద్యను అందించేందుకు దోహదం చేస్తున్నాయని చెప్పారు. విద్య వ్యాపారంలోకి ప్రైవేటు కార్పొరేట్‌ శక్తులను అనుమతిస్తూ దీన్ని రూపొందించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీలో 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులు వీలైనంత త్వరగా చేపట్టాలని చెప్పారు.. పెండింగ్‌లో ఉన్న సప్లిమెంటరీ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి పాటు పడే సంఘం డీటీఎఫ్‌ మాత్రమేనని తెలిపారు. విద్యార్ధులందరికి కామన్‌ స్కూల్‌ విధానం అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రమేశ్‌, ప్రధాన కార్యదర్శి జయకృష్ణ, నాయకులు కుమార్‌, ప్రకాష్‌, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2024 | 10:25 PM