Share News

అన్ని వసతులు కల్పిస్తాం

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:24 PM

పునరావాస గ్రామాల లబ్ధిదారులకు అన్ని వసతు లు కల్పిస్తామని దోమలపెంట ఎఫ్‌ ఆర్‌వో గురుప్రసాద్‌ అన్నారు.

అన్ని వసతులు కల్పిస్తాం
సార్లపల్లిలో అగ్రిమెంట్‌ బాండ్లపై సంతకాలు చేస్తున్న లబ్ధిదారులు

- దోమలపెంట ఎఫ్‌ఆర్‌వో గురుప్రసాద్‌

దోమలపెంట, ఏప్రిల్‌ 5: పునరావాస గ్రామాల లబ్ధిదారులకు అన్ని వసతు లు కల్పిస్తామని దోమలపెంట ఎఫ్‌ ఆర్‌వో గురుప్రసాద్‌ అన్నారు. స్వచ్ఛంద పునరావాస ప్యాకేజీలో భాగంగా ఎన్‌టీసీఏ పథకం కింద అమ్రాబాద్‌ మం డలం సార్లపల్లిలో 186 కుటుంబాలు స్వచ్ఛందంగా గ్రామం విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. శుక్రవారం అటవీశాఖ అధికారులు లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి ఎంవోయూ (మెమోరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌) బాండ్లపై సంతకాలు చేయించారు. ఈ సందర్భంగా దోమలపెంట ఎఫ్‌ఆర్‌వో గురుప్రసాద్‌ మాట్లాడుతూ 186 మంది పునరావాస ప్యాకేజీలో బాగంగా పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామంలో అన్నివసతులతో కాలనీ నిర్మాణం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సార్లపల్లిలో 101 కుటుంబాలకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, ఇంటి నిర్మాణం ఇతర వసతులు కల్పించే జాబితాలో ఉండగా, 85 మంది రూ. 15 లక్షల ప్యాకేజీ తీసుకునేందుకు అంగీకరించారన్నారు. త్వరలోనే కుడిచింతలబావి గ్రామంలో ఎంవోయూ అగ్రిమెంట్‌ చేసుకుంటామని, వటు వర్లపల్లిలో ఆర్‌అండ్‌బీ సర్వే నిర్వహంచి త్వరలోనే లబ్ధిదారులను గుర్తిస్తామని ఆయన వివరించారు. సమావేశంలో ఎప్‌బీవోలు మాధవరెడ్డి, రాజేశ్వరి, శివ ఎన్‌జీవో బాపిరెడ్డి పునరావాస గ్రామ కమిటీ అధ్యక్షుడు పున్యమూరి విష్ణు, సం తోష్‌, వెంకటేష్‌, రమేష్‌ తదితరులున్నారు.

Updated Date - Apr 05 , 2024 | 11:24 PM