బీసీ కులాలన్నీ ఏకమై మధును గెలిపించాలి: ఆర్.కృష్ణయ్య
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:56 AM
బీసీలందరూ ఏకమై మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య కోరారు. నీలం మధు ముదిరాజ్ విద్యానగర్‌లో

రాంనగర్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): బీసీలందరూ ఏకమై మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య కోరారు. నీలం మధు ముదిరాజ్ విద్యానగర్‌లో ఆర్.కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలవడానికి మంగళవారం ఆయన నివాసానికి వచ్చారు. ఎంపీ ఎన్నికల్లో సహకారం అందించి తనకు అండగా నిలవాలని కృష్ణయ్యను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయకులు సుధాకర్ ముదిరాజ్, నందగోపాల్, వేమూరి రామకృష్ణ తదితరులు నీలం మధుకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ సామాజికవర్గానికి చెందిన నీలం మధును ఎంపీ ఎన్నికల్లో గెలిపించుకుంటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీ వర్గాలను గెలిపించుకునే అవకాశం ఉంటుందన్నారు. బీసీ కులాలు, ఇతర అన్ని కులాల మద్దతుదారులు, సానుభూతిపరులు ఐక్యంగా నీలం మధును పార్లమెంట్‌కు పంపించాలని కోరారు.