Share News

TPCC: తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం.. ఎవరంటే?

ABN , Publish Date - Sep 06 , 2024 | 04:50 PM

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుడిగా సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్‌ను అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.

TPCC: తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం.. ఎవరంటే?

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుడిగా సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్‌ను అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇక ఇంతకాలం టీపీసీసీ చీఫ్‌గా అద్భుతంగా పనిచేసిన రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నామని ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. కాగా మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉన్నారు.


Untitled-5.jpg

టీపీసీసీకి నాలుగవ అధ్యక్షుడిగా..

తెలంగాణ నాలుగవ టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నిలిచారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఎన్ఎస్‌యూఐ నుంచి ఆయన పార్టీలో ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 , 2014లో వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. ఇక 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా ఆయన ఉన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 05:17 PM