Share News

హైదరాబాద్‌ తొలి ఎంపీ అహ్మద్‌ మొహియుద్దీన్‌

ABN , Publish Date - May 03 , 2024 | 04:49 AM

హైదరాబాద్‌ లోక్‌సభ అనగానే ఇప్పుడు మీకు ఎవరు గుర్తుకు వస్తారు!? ఒవైసీ కుటుంబం గుర్తుకు వస్తుంది అవునా!? కానీ, ఒవైసీల హవా నాలుగు దశాబ్దాల నుంచే!

హైదరాబాద్‌ తొలి ఎంపీ అహ్మద్‌ మొహియుద్దీన్‌

భాగ్య నగరం నుంచి మొదటి కేంద్ర మంత్రి కూడా

హైదరాబాద్‌ లోక్‌సభ అనగానే ఇప్పుడు మీకు ఎవరు గుర్తుకు వస్తారు!? ఒవైసీ కుటుంబం గుర్తుకు వస్తుంది అవునా!? కానీ, ఒవైసీల హవా నాలుగు దశాబ్దాల నుంచే! అంతకుముందు ఈ నియోజకవర్గం కూడా కాంగ్రెస్‌ కంచుకోట! ఆరుసార్లు ఇక్కడ ఆ పార్టీ గెలిచింది! అంతేనా.. స్వాతంత్య్రం అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి అహ్మద్‌ మొహియుద్దీన్‌ విజయం సాధించారు. భాగ్య నగరం నుంచి కేంద్రంలోని నెహ్రూ క్యాబినెట్‌లో రెండుసార్లు మంత్రి పదవి చేపట్టిన తొలి ఎంపీ కూడా ఆయనే! అప్పట్లో పౌర విమానయానం, సమాచార, ప్రసార శాఖలకు సహాయ మంత్రిగా పని చేశారు.

Updated Date - May 03 , 2024 | 08:02 AM