Share News

సులువుగా ’ఎప్‌సెట్‌’ అప్లికేషన్‌

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:49 AM

అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునేందుకు మరింత అనువుగా ఉండేలా ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎఎఫ్‌సెట్‌)-2024 ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు జేఎన్‌టీయూ అధికారులు తెలిపారు. గతేడాది ఎంసెట్‌(ప్రస్తుతం ఎప్‌సెట్‌) ఆన్‌లైన్‌ దరఖాస్తు సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని

సులువుగా ’ఎప్‌సెట్‌’ అప్లికేషన్‌

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునేందుకు మరింత అనువుగా ఉండేలా ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎఎఫ్‌సెట్‌)-2024 ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు జేఎన్‌టీయూ అధికారులు తెలిపారు. గతేడాది ఎంసెట్‌(ప్రస్తుతం ఎప్‌సెట్‌) ఆన్‌లైన్‌ దరఖాస్తు సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అప్లికేషన్‌ ఫార్మాట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఎంసెట్‌- 2023 దరఖాస్తులో ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీని చూపకపోవడంతో పలువురు అభ్యర్థులు ఓసీ కేటగిరీ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి వచ్చింది. దాంతో సమస్యను పరిష్కరించుకునేందుకు అభ్యర్థులు ఎంసెట్‌ కార్యాలయాన్ని పలుమార్లు సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దఫా అటువంటి సమస్య తలెత్తకుండా ఓసీ కేటగిరీ ఎంచుకున్న వెంటనే అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్‌ కేటగిరి ఆప్షన్‌ కనిపించేలా అప్లికేషన్‌లో మార్పు చేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే గతేడాది ఎంసెట్‌ పరీక్షలను 70 శాతం సిలబ్‌సతో నిర్వహించగా, ఈ ఏడాది 100 శాతం సిలబ్‌సతో పరీక్షలు నిర్వహించాలని ఎప్‌సెట్‌ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన సిలబస్‌ కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 10:36 AM