ఆదిలాబాద్ జిల్లాకు నర్సారెడ్డి పేరు పెట్టాలి: వీహెచ్
ABN , Publish Date - Feb 06 , 2024 | 04:16 AM
పీసీసీ మాజీ చీఫ్ నర్సారెడ్డి పేరును ఆదిలాబాద్ జిల్లాకు పెట్టాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ప్రతిపాదించారు. గాంధీభవన్‌లో సోమవారం జరిగిన నర్సారెడ్డి సంస్మరణ
హైదరాబాద్, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): పీసీసీ మాజీ చీఫ్ నర్సారెడ్డి పేరును ఆదిలాబాద్ జిల్లాకు పెట్టాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ప్రతిపాదించారు. గాంధీభవన్‌లో సోమవారం జరిగిన నర్సారెడ్డి సంస్మరణ సభలో ఆయన ఈ సూచన చేశారు. దీనిపై సభలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి తగిన కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి కె.జానారెడ్డి మాట్లాడుతూ ఆయన సొంత జిల్లా అయిన నిర్మల్‌కు నర్సారెడ్డి పేరు పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంస్మరణ సభలో కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, ఎమ్మెల్సీ మహే్‌షకుమార్‌గౌడ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్, ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.