Share News

ఘనంగా ఆది శంకరాచార్యుల జయంతి

ABN , Publish Date - May 12 , 2024 | 11:05 PM

డ్చర్ల పట్టణంలోని బ్రాహ్మణసేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ఆది శంకరాచార్యుల జయంతి

మిడ్జిల్‌, మే 12 : జడ్చర్ల పట్టణంలోని బ్రాహ్మణసేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణసేవా సమితి జిల్లా అధ్యక్షుడు భీమాచార్యులు, ప్రధానకార్యదర్శి గొండ్యాల రాఘవేంద్రశర్మ, శ్రవణ్‌కుమార్‌ శర్మల ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి ఆలయంలో ఆది శంకరాచార్యుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రతీ ఒక్కరు సన్మార్గంలో ముందుకు సాగి శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించాలని వారు కోరారు. కార్యక్రమంలో బ్రాహ్మణసేవ సమితి సీనియర్‌ నాయకులు బాదేపల్లి రంజిత్‌బాబు, పట్టణ అధ్యక్షులు నరేంద్రశర్మ, నాయకులు సుమన్‌శర్మ, రమాకాంత్‌, దత్తుకుమార్‌, పురుషోత్తంరావు, భాస్కర్‌, నరసింహారావు, జ్యోషి రాఘవేంద్రశర్మ, అంభి రామచంద్రన్‌, వి. రాఘవేంద్రశర్మ ఉన్నారు.

పాతబజార్‌ శివాలయంలో

జడ్చర్ల పట్టణంలోని పాతబజార్‌ శివాలయంలో జగద్గురువు ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలను ఆదివారం బ్రాహ్మణసేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని శంకరాచార్యుల విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామికి పంచామృతాభిషేకం, శివుడికి రుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసింహారావు, ప్రదీప్‌పాటిల్‌, ఆలయ ధర్మకర్త భార్గవశర్మ, రాఘవేంద్రరావు, ప్రవీణ్‌, శ్రీధర్‌, శిరీష్‌ కుమార్‌, శ్రీనివాస్‌, వెంకట్రావు, గట్టు నవీన్‌, ఇరివెంటి శ్రీకాంత్‌, ప్రసాద్‌, కృష్ణశాస్ర్తీ, గోనెల రాధకృష్ణ పాల్గొన్నారు.

కోయిలకొండలో...

కోయిలకొండ : మండలంలోని అభంగపట్నంలో ఆదిశంకరాచార్యుల జయం తి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శంక రాచార్యుల విగ్రహానికి ఫల పంచామృత అభిషేకం, బిల్వార్చన పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయం వద్ద అడుగుల భజన, కోలాటాల కార్యక్ర మాలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశా రు. ఈ కార్యక్రమంలో శేఖర్‌స్వామి, వెంకటస్వామి, వెంకట్రాములు, వీరప్ప, రంగప్ప, రాకమయ్య, కేశవులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 11:05 PM