Share News

రైతులకు సరిపడా జనుము విత్తనాలు

ABN , Publish Date - May 29 , 2024 | 11:21 PM

జిల్లాలో రైతులకు సరిపడా జనుము విత్తనాలు ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్‌ అన్నారు.

రైతులకు సరిపడా జనుము విత్తనాలు

- జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్‌

నవాబ్‌పేట, మే 29 : జిల్లాలో రైతులకు సరిపడా జనుము విత్తనాలు ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు ఆగ్రోస్‌ సేవా కేంద్రాన్ని ఏఓ కృష్ణకిషోర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లాకు 1100 క్వింటాళ్ల జనుము విత్తనాలు వచ్చాయని, 927 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు ఆగ్రోస్‌ సేవా క్రేంద్రం ద్వారా పంపిణీ చేసినట్లు తెలిపారు. తెలంగాణ విత్తన సంస్థ నుంచి ఇంకా 720 క్వింటాళ్ల విత్తనాలు అందాల్సి ఉందని విత్తన సంస్థ మేనేజర్‌ రాజు తెలిపారు. తొలకరి వర్షం ఆరు సెంటిమీటర్లు పడినప్పుడు విత్తనాలు విత్తుకోవాలని రైతులకు సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పతనిసరిగా రైతులు సదరు డీలరల ్లనుంచి రశీదులు పొందాలని సూచించారు. డీఏవో వెంట డీలర్లు రఘు, చంద్రకాంత్‌, కృష్ణయ్య, భాస్కర్‌, బాలరాజు పాల్గొన్నారు.

విత్తనాలు అధిక ధరలకు అమ్మితే చర్యలు

కోయిలకొండ : విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి రామ్‌పాల్‌ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్‌ దుకాణాలను తనఖీ చేశారు. ప్రభ్వుతం నిర్ణయించిన ధరలకు మాత్రమే విత్తనాలు, ఎరువులు అమ్మాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు అమ్మితే దుకాణం సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యాయబ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:22 PM