Share News

వన్యప్రాణులకు నీటి సమస్య లేకుండా చర్యలు

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:03 AM

నల్లమల్లలో అటవీ జంతువులు, వన్యప్రాణులకు వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని నాగార్జునసాగర్‌ డివిజన అటవీశాఖ అ ధికారి సర్వేశ్వర్‌రా వు కోరారు.

 వన్యప్రాణులకు నీటి సమస్య లేకుండా చర్యలు
నీటి తొట్లను పరిశీలిస్తున్న సర్వేశ్వర్‌రావు

వన్యప్రాణులకు నీటి సమస్య లేకుండా చర్యలు

నాగార్జునసాగర్‌ డివిజన అటవీశాఖ అధికారి సర్వేశ్వర్‌రావు

దేవరకొండ, ఏప్రిల్‌ 11: నల్లమల్లలో అటవీ జంతువులు, వన్యప్రాణులకు వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని నాగార్జునసాగర్‌ డివిజన అటవీశాఖ అ ధికారి సర్వేశ్వర్‌రా వు కోరారు. నల్లమల్ల కంబాలపల్లి రేంజ్‌ పరిధిలో కంబాలపల్లి, పొగిళ్ల, రేకులవలయం అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులు, అటవీ జంతువుల కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్లను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎండలు అధికంగా ఉన్నందున నీటితొట్లలో రోజువారీగా నీరు నింపాలని అన్నారు. నీటి సమస్య ఉంటే అదనంగా బోర్లు వేసి పైపుల ద్వారా నీరు అందించాలని అధికారులను సూచించారు. ఇప్పటికే నల్లమల్లలో తాగునీటి కోంస వందకుపైగా నీటితొట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నీటితొట్లతో పాటు చెక్‌డ్యాంలు, కుంటల్లో నీరు నింపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెల్‌దేవరపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని సమాచారం ఉన్నందున అటవీశాఖ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. అటవీ జంతువులు, వన్యప్రాణులు అడవిని దాటి బయటకు వెళ్లకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆ యన వెంట కంబాలపల్లి రేంజ్‌ అటవీశాఖ అధికారి భాస్కర్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 12:03 AM