Share News

మద్దతు ధరకంటే తక్కువకు కొంటే చర్యలు

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:40 PM

ప్ర భుత్వం వరికి నిర్ణ యించిన కనీస మద్దతు ధరకు తక్కువగా వ్యాపా రులు, దళారులు కొంటే చట్టపరమైన చర్యలు తీసు కుంటామని డీఏవో బి.వెంకటేశ్‌ హెచ్చరించా రు.

మద్దతు ధరకంటే తక్కువకు కొంటే చర్యలు
అడ్డాకుల రైతువేదికలో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేశ్‌

డీఏవో బి.వెంకటేశ్‌

అడ్డాకుల, ఏప్రిల్‌ 16 : ప్ర భుత్వం వరికి నిర్ణ యించిన కనీస మద్దతు ధరకు తక్కువగా వ్యాపా రులు, దళారులు కొంటే చట్టపరమైన చర్యలు తీసు కుంటామని డీఏవో బి.వెంకటేశ్‌ హెచ్చరించా రు. మంగళవారం అడ్డాకు ల రైతువేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భా గంగా హైదరాబాద్‌ రాజేందర్‌నగర్‌ వ్యవసాయ శాస్త్ర వేత్తలు సేంద్రియ వ్యవసాయంపైన రైతులకు వీడి యో కాన్పరెన్స్‌ ద్వారా అవగాహన కలిగిం చిన తర్వా త నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మా ట్లాడారు. రైతులు కనీస మద్దతు ధర రూ.2203కు అమ్ముకోవాలని, రైతులు తప్పనిఒ సరిగా 17శాతం కన్న తక్కువ తేమ, ఖచ్చితంగా తూర్పార బట్టి 1శాతం తాలు మించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ఫేర్‌ యావరేజ్‌ క్వాలిటీ (ఎఫ్‌ఏక్యూ) కనీస ధాన్యం నాణ్యతా ప్రమా ణాలను రైతులు పాటించాలని కోరారు. కార్యక్రమం లో ఏడీఏ యశ్వంత్‌రావ్‌, అడ్డాకుల ఎంఏఓ శ్రీనివా సులు, మూసాపేట ఎంఏవో రాజేందర్‌రెడ్డి, దేవరకద్ర ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:40 PM