Share News

నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:25 PM

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు.

నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
ఊట్కూర్‌లో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీహర్ష

- కలెక్టర్‌ శ్రీహర్ష

- ఊట్కూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం

- ఇంటర్‌ పరీక్ష కేంద్రాల పరిశీలన

ఊట్కూర్‌/నారాయణపేట టౌన్‌, మార్చి 1: వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం ఊట్కూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో వివిధ అంశాలపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలవారిగా రిపోర్టు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే హరితహారంలో నాటిన మొక్కలు ఎండకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించి కూలిని వెంటనే ఇవ్వాలని, పైపులైను లీకేజీలు లేకుండా చూడాలని, రోడ్ల మరమ్మతు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలను తనిఖీ చేశారు. కలెక్టర్‌ వెంట డీఆర్‌డీవో రాజేశ్వరి, తహసీల్దార్‌ మమత, ఎంపీడీవో ధనుంజయ్‌గౌడ్‌ ఎంపీవో ఎల్‌ఎంఎన్‌ రాజు, పీఆర్‌ ఏఈ జగత్‌చంద్ర, ఏపీవో సత్యప్రకాష్‌ ఈసీ మహిపాల్‌రెడ్డి వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రశాంత వాతావరణంలో పరీక్షలు

- వీసీలో కలెక్టర్‌ శ్రీహర్ష

ఇంటర్‌, పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులు నిర్దేశిత సమయం కంటే అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్‌ శ్రీహర్ష సూచించారు. ఇంటర్మీడియట్‌, పదో త రగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ముఖ్య కా ర్యదర్శి శాంతికుమారి శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు కీలక సూ చనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికా రులతో మాట్లాడుతూ... ఇంటర్‌తో పాటుగా , త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. విద్యార్థులు నిర్దేశిత సమయం కంటే అరగంట ముందే పరీక్ష కేం ద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని చె ప్పారు. అందుకు అనుగుణంగా ఆర్టీసీ బస్సుల ను సరైన సమయానికి నడపాలన్నారు. సరైన రూట్‌ నిర్దేశించుకుని విద్యార్థులకు బస్సు అందు బాటులో ఉండే విధంగా ప్రణాళికలు చేసుకో వాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అర గంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా చూడాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోను పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లను అనుమతించేది లేదన్నారు. ఎవరైనా తీసుకెళ్లినట్లు తెలిస్తే కేసు బుక్‌ చేస్తామన్నారు. పరీక్షల్లో కాపీయింగ్‌కు ఎట్టి పరిస్థితుల్లోను అవకాశం ఇవ్వరాదని పకడ్బందీగా పరీక్షలు ని ర్వహించాలని ఆదేశించారు. అలాంటి ఘట న లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజాపాలనలో దరఖాస్తులు స మర్పించిన అందరికీ ప్రభుత్వ పథకాలు వర్తిసా యని దరఖాస్తులు సమర్పించని వారుంటే ప్ర జాపాలన సేవాకేంద్రాలలో తమ వివరాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. సమావేశం లో జడ్పీ సీఈవో శైలజ, డీఈవో అబ్దుల్‌ ఘని, డీఎస్పీ లింగయ్య, డీఐఈవో రియాజ్‌ హుస్సేన్‌, అధికారులు పాల్గొన్నారు.

ప్రగతిపై దృష్టి సారించాలి

ప్రతీ పని పై ప్రత్యేక దృష్టిని సారించాలని కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని తన చాంబర్‌లో వ్యవసాయ, పశు సంవ ర్ధక, మత్స్యశాఖ జిల్లా అధికారులతో శాఖ పరం గా ప్రగతి పనులు, నిర్ధేశించిన లక్ష్యాలపై కలెక్టర్‌ సమీక్షించారు. శాఖల వారిగా జరిగే అభివృద్ధి పనులు, చేయాల్సిన పనులపై సంబంధిత అధి కారులతో చర్చించి నిర్ధేశించిన లక్ష్యాలను సకా లంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమా వేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:25 PM