Share News

కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు : ఆర్డీవో

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:59 PM

ధా న్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని చండూరు ఆర్డీవో సుబ్రహ్మ ణ్యం హెచ్చరించారు.

 కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు : ఆర్డీవో
ధాన్యాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో సుబ్రహ్మణ్యం

కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు : ఆర్డీవో

మర్రిగూడ, ఏప్రిల్‌ 16: ధా న్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని చండూరు ఆర్డీవో సుబ్రహ్మ ణ్యం హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి మినీ ఎడిషనలో మంగళవారం ప్రచురితమైన ‘వారం రోజులుగా రైతులు పడిగాపులు’ అనే శీర్షికపై వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. మండలంలోని మర్రిగూడ, ఎర్రగండ్లపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పలు గ్రామాల నుంచి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను వారి సమస్యలను అడిగి తె లుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతోనే కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లే తెలిపారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని నిర్లక్ష్యం చే యకుండా త్వరగా కొనుగోలు చేయాలని సూచించారు. ఆయన వెంట జిల్లా మేనేజర్‌ సివిల్‌ సప్లయ్‌ అధికారి నాగేశ్వర్‌, మర్రిగూడ తహసీల్దార్‌, సివిల్‌ సప్లయ్‌ ఆర్‌ఐ అబీద్‌, పాండు రంగారెడ్డి, ఏపీఎం, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.

ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీవో సుబ్రహ్మణ్యం

చండూరు: ఎన్నికల విధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో సుబ్రహ్మణ్యం సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మంగళవారం మునుగోడు నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని, మద్యాన్ని నిరోధించాలని అన్నారు. ఎన్నికల కోడ్‌ పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల టీం అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ప్రతి ఒక్క టీం అధికారి తనవంతు పాత్ర పో షించాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్‌ దశరథ, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికా రి దేవాసింగ్‌, ఎంపీడీవో అనురాధ, జిల్లాస్థాయి మాస్టర్‌ ట్రైనర్లు సోమయ్య, వెంకటేశ్వర్లు, ఎలక్షన డీటీ దీపక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:59 PM