కర్ర బొగ్గు ఉత్పత్తిదారులను వేధిస్తే చర్యలు
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:37 AM
నల్లగొండ జిల్లాలో కర్ర బొగ్గు ఉత్పత్తిదారులను వేధించే విషయం తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ పేట్ల

నల్లగొండ జిల్లా అటవీశాఖాధికారి రాజశేఖర్
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి వివరణ
నల్లగొండ, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలో కర్ర బొగ్గు ఉత్పత్తిదారులను వేధించే విషయం తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ పేట్ల పేర్కొన్నారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన ‘బొగ్గు వేబిల్లుకు రూ.6వేలు’ కథనానికి ఆయన వివరణ పంపారు. కథనంలో పేర్కొన్న ఆరోపణలపై క్షేత్రస్థాయి సిబ్బందితో విచారణ జరిపించామని తెలిపారు. కర్ర బొగ్గు రవాణాకు అధికారులు జారీ చేసే ఫాం-2 పర్మిట్ల ద్వారానే బొగ్గు సరఫరా జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో బొగ్గు ఉత్పత్తిదారుల నుంచి అటవీశాఖ సిబ్బందిపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, ఎవరైనా వేధిస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.