‘మాగనూరు’ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:21 AM
నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత ప్రభుత్వ పాఠశాలలో జరిగిన పుడ్ పాయిజనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ డిమాండ్ చేశారు.

‘మాగనూరు’ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ
దేవరకొండ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత ప్రభుత్వ పాఠశాలలో జరిగిన పుడ్ పాయిజనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ డిమాండ్ చేశారు. దేవరకొండలో ఎస్‌ఎ్‌ఫఐ డివిజన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం వివిధ కళాశాలల్లో ఎస్‌ఎ్‌ఫఐ సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఫుడ్ పాయిజనతో ఇప్పటికి నలుగురు విద్యార్థులు మృతి చెందగా 920 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యార ని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా ఫుడ్ పాయిజన ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలు చేపట్టడం లేదని అన్నారు. నాసిరకం బియ్యం, కుళ్లిపోయిన కూరగాయలు విద్యార్థులకు వండి పెడుతున్నట్లు ఆరోపించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్థవ్యస్తంగా మారిందని ఆరోపించారు. మంత్రిని నియమించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై ఎస్‌ఎ్‌ఫఐ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ డివిజన కార్యదర్శి బుడిగ వెంకటేష్, నాయకులు రా ములు, చరణ్, సన్ని, విక్రమ్, శైలజ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.