నార్నే ఎస్టేట్ అధీనంలోని సీలింగ్ భూముల స్వాధీనం
ABN , Publish Date - Feb 23 , 2024 | 12:26 AM
యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమారం రెవెన్యూ పరిధిలో ప్రముఖ నార్నే ఎస్టేట్ (ఈస్ట్ సిటీ) అధీనంలో ఉన్న సర్వే నెంబర్ 254 లోని 4.10 ఎకరాల సీలింగ్ భూమిని అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) భాస్కర్‌రావు స్వాధీనం చేసుకున్నారు.
నార్నే ఎస్టేట్ అధీనంలోని సీలింగ్ భూముల స్వాధీనం
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఘటన
బీబీనగర్, ఫిబ్రవరి 22: యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమారం రెవెన్యూ పరిధిలో ప్రముఖ నార్నే ఎస్టేట్ (ఈస్ట్ సిటీ) అధీనంలో ఉన్న సర్వే నెంబర్ 254 లోని 4.10 ఎకరాల సీలింగ్ భూమిని అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) భాస్కర్‌రావు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడమటి సోమారం గ్రామంలోని సర్వే నెంబర్ 254 లో 4.10 ఎకరాల భూమిని ఇదే గ్రామానికి చెందిన పేద రైతులు యాగ దేవయ్య, వ్యాగరి లింగయ్యలకు ప్రభుత్వం పంపిణీ చేసిందని తెలిపారు. ఈ సీలింగ్ భూములు నార్నే ఎస్టేట్ సంస్థ అధీనంలో ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని, దాంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అసైన్డ సీలింగ్ భూములను పరిశీలిస్తున్నామని, రైతుల చేతుల్లో కాకుండా ఇతరుల అధీనంలో ఉంటే స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో అ మరేందర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీధర్, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి ఉన్నారు.