Share News

పాలన చేతకాక మాపై నిందారోపణలు

ABN , Publish Date - Feb 01 , 2024 | 03:42 AM

కాంగ్రెస్‌ నాయకులకు పాలన చేతకాక బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుపై విమర్శలకు దిగుతున్నారని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మఽధు, కోరుకంటి చందర్‌ ఆరోపించారు. తెలంగాణ

పాలన చేతకాక మాపై నిందారోపణలు

ఓటర్లను అవమానించేలా రేవంత్‌ వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ నాయకులకు పాలన చేతకాక బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుపై విమర్శలకు దిగుతున్నారని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, కోరుకంటి చందర్‌ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే.. మూసీలో వేసినట్లేనని రేవంత్‌ వ్యాఖ్యానించడం ఓటర్లను అవమానించడమేనన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కయ్యాయంటూ సీఎం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీని కేసీఆర్‌ ప్రశ్నించినంతగా ఎవరూ ప్రశ్నించలేదని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడ్డ కేటీఆర్‌, హరీశ్‌రావును బిల్లా రంగాలతో పోల్చడం దారుణమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమను గెలిపిస్తేనే.. హామీలను నెరవేరుస్తామని రేవంత్‌ వ్యాఖ్యానించడం ప్రజలను మోసం చేయడమేని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆరోపించారు. చెప్పులు మోసే వారిని కూడా ఎమ్మెల్సీలుగా కేసీఆర్‌ నామినేట్‌ చేశారన్న రేవంత్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కె.సత్యరాయణ పేర్కొన్నారు. రేవంత్‌ వ్యాఖ్యలు ఎరుకల జాతినే అవమానపరిచేలా ఉన్నాయని ధ్వజమెత్తారు.

Updated Date - Feb 01 , 2024 | 10:30 AM