Share News

సన్నాల మాటున.. దొడ్డు మోసం!

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:55 AM

మీరు సన్నబియ్యం అనుకుంటూ వండుకుంటున్న బియ్యం అసలు సన్న బియ్యమే కాకపోవచ్చునేమో!

సన్నాల మాటున.. దొడ్డు మోసం!

రేషన్‌ బియ్యం కేజీ రూ.10కి కొని రీసైక్లింగ్‌

బ్రాండెడ్‌ సన్న బియ్యంగా రంగురంగుల బస్తాల్లోకి

కేజీ రూ.40 చొప్పున విక్రయం.. మిల్లులు అడ్డాగా దందా

కోతల వేళ సిండికేట్‌గా మిల్లర్లు.. సన్నాల ధరలు ఢమాల్‌

క్వింటాకు రూ.500 తగ్గింపు.. మిర్యాలగూడలో దందా

గన్నీ సంచులకు ఖాప్రా చీడ.. మిల్లర్లకు కష్టాలు

ఆ సంచుల్లోని బియ్యం తీసుకోవడానికి ఎఫ్‌సీఐ నో

వరంగల్‌, నల్లగొండ, జగిత్యాల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మీరు సన్నబియ్యం అనుకుంటూ వండుకుంటున్న బియ్యం అసలు సన్న బియ్యమే కాకపోవచ్చునేమో! ఆ బియ్యం కోసం మీరు నాలుగైదింతల మేర ధర ఎక్కువగా పెట్టి కొని ఉండవచ్చేమో! దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి మీకు సన్న బియ్యంగా అంటగడుతున్నారేమో! ఎందుకంటే వ్యాపారులు, రైస్‌ మిల్లర్లు కలిసి సన్న బియ్యం పేరుతో వినియోగదారులను నిండా ముంచుతున్నారు. ఈ ‘రేషన్‌ బియ్యం మాఫియా’ దందా యథేచ్ఛగా జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అన్నం ముద్దలు ముద్దలవుతోంది

ఇటీవల భూపాలపల్లిలోని ఓ రైస్‌ డిపోలో సోనామసూరి 25కేజీల బ్యాగ్‌ తీసుకున్నాను. ఇంటికెళ్లి వండితే అన్నం దొడ్డుగా, ముద్దలుముద్దలైంది. వెంటనే బియ్యం కొనుగోలు చేసిన షాపు వద్దకు వెళ్లి అడిగాను. ‘‘మేమేం చేయలేం. ఇంకోసారి తీసుకోకు’’ అంటూ సమాధానం చెప్పారు.

- శ్యామ్‌ప్రసాద్‌, సింగరేణి అధికారి, భూపాలపల్లి జిల్లా

రీసైక్లింగ్‌ బియ్యమే విక్రయిస్తున్నారు

భూపాలపల్లిలోని ఓ బియ్యం షాపులో నెలకు 25కేజీల బియ్యం బస్తా తీసుకెళ్తా. షాపు యజమానులు హెచ్‌ఎంటీ, సాంబమసూర, సోనా మసూర, జైశ్రీరాం అని రకరకాల బియ్యం ఇస్తూ ఉంటారు. గత నెల ఇంటికెళ్లాక అన్నం దొడ్డు అవుతుందని.. బియ్యం ఎక్కడ తెచ్చావని, ఇంట్లో వాళ్లు గోలపెడితే చేసేదేం లేక వాపసు ఇచ్చేందుకు వెళ్లా.

-రాజేందర్‌, సింగరేణి కార్మికుడు, భూపాలపల్లి

Updated Date - Mar 24 , 2024 | 02:55 AM