Share News

అ‘క్రమబద్ధీకరణ’లను రద్దుచేయాలి: రియల్టర్స్‌

ABN , Publish Date - Jan 28 , 2024 | 03:25 AM

హైదరాబాద్‌, నగర శివారు ప్రాంతాల్లో జీవో 59 పేరుతో గత ప్రభుత్వ హయంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను దొడ్డిదారిన పెద్దలకు క్రమబద్ధీకరించిన వ్యవహారాలకు సంబంధించి విచారణ చేపట్టాలని తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరింది.

అ‘క్రమబద్ధీకరణ’లను రద్దుచేయాలి: రియల్టర్స్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): హైదరాబాద్‌, నగర శివారు ప్రాంతాల్లో జీవో 59 పేరుతో గత ప్రభుత్వ హయంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను దొడ్డిదారిన పెద్దలకు క్రమబద్ధీకరించిన వ్యవహారాలకు సంబంధించి విచారణ చేపట్టాలని తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరింది. అక్రమాలు నిర్ధారణైతే క్రమబద్ధీకరణలను రద్దు చేసి బాఽధ్యులపై చర్యలు తీసుకోవాలని సంస్థ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం ‘అంతులేని అక్రమబద్ధీకరణ’ శీర్షికతో ఆంధ్రజ్యోతి వార్తా కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. జీవో 59పై ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తా కథనం అక్షరసత్యమని నారగోని అన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:40 AM