అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:24 AM
దేశ శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఏపీజే అబ్దుల్ కలాం అందించిన విశిష్ట సేవలు చిరస్మరణీయమని కోదాడ పట్టణ ప్రముఖులు అన్నారు.

కోదాడ టౌన్ / మద్దిరాల, జూలై 27 : దేశ శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఏపీజే అబ్దుల్ కలాం అందించిన విశిష్ట సేవలు చిరస్మరణీయమని కోదాడ పట్టణ ప్రముఖులు అన్నారు. శనివారం ఆయన వర్ధంతి సందర్భంగా విజయీభవ ట్రస్ట్, స్వర్ణభారతి ట్రస్ట్, ముస్లిం మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీపార్క్‌లో ఉన్న కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కార్యక్రమంలో స్వర్ణభారతి ట్రస్ట్ అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీనివాసరావు, ఇరుకుళ్ల ఫౌండేషన్ అధ్యక్షుడు ఇరుకుళ్ల చెన్నకేశవరావు, యాద సుధాకర్, పుల్లకాండం సాంబశివరావు, గుడుగుంట్ల సాయి, పైడిమర్రి రామారావు, జగనీప్రసాద్, రాయపూడి వెంకటనారాయణ, వెంపటి వెంకటేశ్వరరావు, రవి, ముస్లీం మైనార్టీ నాయకులు అలీబాయ్, జహీర్, నజీర్, జానీ, బాబా, దాదావలి, ముస్తాఫా, రఫీ, మజర్, ఉద్దండు, చోటు పాల్గొన్నారు. అదేవిధంగా మద్దిరాల మండలకేంద్రంలో అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా సీపీఆర్‌పై పీహెచ్‌సీ మండల వైద్యాధికారి నగేష్‌నాయక్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఏపీఎం రాజేష్,ఏపీవో వెంకన్న పాల్గొన్నారు.