Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:34 AM

కోళ్ల వాహనాన్ని కారు ఢీకొట్టి న ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం శనివారం అర్ధరాత్రి 2 గంటలకు నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల ప రిధిలో జడ్చర్ల- కోదాడ జాతీయ రహదారిపై అంగడిపేట ఎక్స్‌రో డ్డు సెంటర్‌లో చోటుచేసుకుంది.

 రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
అజయ్‌ (ఫైల్‌ఫొటో)

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

కోళ్ల వాహనాన్ని ఢీకొన్న కారు

వాహనం పైనుంచి పడటంతో మృత్యువాత

పెద్దఅడిశర్లపల్లి, జూలై 7: కోళ్ల వాహనాన్ని కారు ఢీకొట్టి న ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం శనివారం అర్ధరాత్రి 2 గంటలకు నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల ప రిధిలో జడ్చర్ల- కోదాడ జాతీయ రహదారిపై అంగడిపేట ఎక్స్‌రో డ్డు సెంటర్‌లో చోటుచేసుకుంది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు తె లిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం బసిరెడ్డిపల్లికి చెందిన రేబెల్లి అజయ్‌ (20) పదిహేను రోజులుగా తెప్పలమడుగు గ్రామానికి చెందిన ఐతనబోయిన గిరి కోళ్ల వాహనం న డుపుతూ చికెన షాపులకు కోళ్లు సరఫరా చేస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి మండల పరిధిలో కోళ్లు సరఫరా చేయడానికి గుడిపల్లి గ్రామం నుంచి వస్తూ అంగడిపేట ఎక్స్‌రోడ్డు సెంటర్‌లో రోడ్డు దాటుతుండగా పెద్దవూర నుంచి వస్తున్న కారు కోళ్ల వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అజ య్‌ వాహనం పల్టీలు కొట్టింది. వాహనం డోర్‌ తెరుచుకుని అజ య్‌ కిందపడగా కోళ్ల వాహనం అతని పైనుంచి పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెం దాడు. వాహనంలో ఉన్న మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అతడిని వెంటనే 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి రమణయ్య (రామన్న) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నర్సింహులు తెలిపారు.

Updated Date - Jul 08 , 2024 | 12:34 AM