Share News

బాలుడి కిడ్నాప్‌ కేసులో ఏడాది జైలు

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:22 AM

బాలుడిని అపహరించిన కేసులో నిం దితుడికి న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించింది

  బాలుడి కిడ్నాప్‌ కేసులో ఏడాది జైలు

బాలుడి కిడ్నాప్‌ కేసులో ఏడాది జైలు

మిర్యాలగూడ లీగల్‌, ఫిబ్రవరి 1: బాలుడిని అపహరించిన కేసులో నిం దితుడికి న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించింది. దామరచర్ల మండ లం కొండ్రపోల్‌ గ్రామానికి చెందిన పట్టేటి వినోద్‌కుమార్‌పై నేరం రుజువు కా వడంతో ఏడాది జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ రెండో అదనపు మెజిస్ర్టేట్‌ కోర్టు ఇనచార్జి, జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ర్టేట్‌ ఎ.స్వర్ణలత గురువా రం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. దామరచర్ల మండలం కొండ్రపోల్‌ గ్రామానికి చెందిన రాసమల్ల మేరి, నాగేంద్రబాబు దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు 2023 జూన 8న రాత్రి వా రి ఇంట్లో నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌ పాత కక్షలను మనసులో పెట్టుకొని వారి కుమారుడైన రాసమల్ల అక్షయ్‌ను కిడ్నాప్‌ చేశాడు. తమ కుమారుడిని వినోద్‌కుమార్‌ అపహరించాడని నాగేంద్రకుమార్‌, మేరి దంపతులు దామరచర్ల పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన అప్పటి వాడపల్లి ఎస్‌ఐ ఎం.రవికుమార్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించి నిందితుడు వినోద్‌కుమార్‌పై కిడ్నాప్‌ కేసు నమోదు చేసి అతడి పై కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన ప్రవేశపెట్టిన సాక్షులను విచారించిన న్యాయస్థానం పట్టేటి వినోద్‌కుమార్‌పై నేరం రుజువు కావడంతో ఏడాది జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన తరఫున ఏపీపీ ఎస్‌.దీపారాణి వాదించగా, ప్రాసిక్యూషనకు కో ర్టు కానిస్టేబుల్‌ జానకిరాములు సహకరించారు.

Updated Date - Feb 02 , 2024 | 11:10 AM