Share News

షాపింగ్‌మాల్‌ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:49 AM

నగరంలో ఓ మహిళ తాను పనిచేస్తున్న షాపింగ్‌మాల్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేటలో నివాసముండే రమణమ్మ(50)అనే మహిళ కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని చెన్నై సిల్క్స్‌ షాపింగ్‌మాల్‌లో హౌస్‌కీపర్‌గా పనిచేస్తోంది. సోమవారం విధులకు

షాపింగ్‌మాల్‌ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

కూకట్‌పల్లి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): నగరంలో ఓ మహిళ తాను పనిచేస్తున్న షాపింగ్‌మాల్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేటలో నివాసముండే రమణమ్మ(50)అనే మహిళ కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని చెన్నై సిల్క్స్‌ షాపింగ్‌మాల్‌లో హౌస్‌కీపర్‌గా పనిచేస్తోంది. సోమవారం విధులకు హాజరైన ఆమె షాపింగ్‌మాల్‌లోని 4వ అంతస్తు నుంచి కిందకు దూకింది. దాంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రమణమ్మ తన కుమారుడికి ఓ ఆడియో మెసేజ్‌ పెట్టినట్లు గుర్తించిన పోలీసులు దానిని పరిశీలించగా వాయిస్‌ స్పష్టంగా లేనట్లు తెలిసింది. రమణమ్మ ఆత్మహత్యకు ఆమెతో కలిసి షాపింగ్‌మాల్‌లో పనిచేసే వారి వేధింపులే కారణమని రమణమ్మ బంధువులు ఆరోపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - Feb 06 , 2024 | 03:49 AM