ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఘన స్వాగతం
ABN , Publish Date - Nov 10 , 2024 | 11:06 PM
లం డన్ పర్యటన విజయవంతంగా ముగిం చుకొని ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణను మండల కాం గ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలి కారు.
మన్ననూర్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : లం డన్ పర్యటన విజయవంతంగా ముగిం చుకొని ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణను మండల కాం గ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలి కారు. ఎమ్మెల్యే స్వదేశానికి వచ్చే సమాచా రాన్ని తెలుసుకున్న మండల కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం ఉదయమే రాజీవ్ గాంధీ విమానా శ్రయానికి వెళ్లి ఎమ్మెల్యేకు పూల బొకే ఇచ్చి శాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలి కారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యు డు దాసరి శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు రమణగౌడ్, రవికుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.