Share News

సర్పంచులకు సన్మానం

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:31 PM

ఐదేళ్లుగా గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు అందించి, ప్రతిపక్ష పాత్రను పోషించిన ప్రజాప్రతిధులైన బీజేపీ సర్పంచులను ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఏపీ మిథున్‌రెడ్డి అభినందించారు.

సర్పంచులకు సన్మానం
సర్పంచులను సన్మానిస్తున్న బీజేపీ నాయకుడు ఏపీ మిథున్‌ రెడ్డి

- పూర్తయిన సర్పంచుల పదవీ కాలం

- పలు గ్రామాల్లో పాలకవర్గాలకు ఘన సన్మానం

- ఐదేళ్లు ప్రజాసేవ చేశామన్న సర్పంచులు

- ప్రజల సహకారం వల్లే సాధ్యమన్న సర్పంచులు

మహబూబ్‌నగర్‌ (క్లాక్‌టవర్‌), ఫిబ్రవరి 1 : ఐదేళ్లుగా గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు అందించి, ప్రతిపక్ష పాత్రను పోషించిన ప్రజాప్రతిధులైన బీజేపీ సర్పంచులను ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఏపీ మిథున్‌రెడ్డి అభినందించారు. ఈ మేరకు గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ధర్మాపూర్‌ సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, చౌదర్‌పల్లి సర్పంచ్‌ శంకరమ్మ, మణికొండ సర్పంచ్‌ గంగన్నలను ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డితో కలిసి సన్మానించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచులది పదవికాలం మాత్రమే పూర్త య్యిందని, కాని ప్రజలకు మరిన్ని సేవలు అందించాల్సిన అవసరం ఉంద ని అభిప్రాయపడ్డారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికలనుద్దేశించి మాట్లాడు తూ ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లోతుగా ప్రజల్లోకి తీసుకవెళ్లాలని వివరించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన అందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్‌ రెడ్డి, కోశాధికారి శేరి పాండురం గారెడ్డి, అసెంభ్లీ కన్వీనర్‌ అంజయ్య, కౌన్సి లర్‌ చెన్నవీరయ్య, పట్టణ అధ్యక్షుడు నారా యణ యాదవ్‌, నాయకులు సంపత్‌కుమార్‌, బుడ్డన్న, రాజుగౌడ్‌, జాన్‌ శ్రీనివాసులు, రఘురామ్‌ గౌడ్‌, నర్సిములు, శ్రీశైలం యాదవ్‌ పాల్గొన్నారు.

గ్రామానికి సర్పంచు ప్రథమ పౌరుడు

గండీడ్‌ : భారత దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి , గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచు అని విశ్రాంత ఉపాధ్యాయులు కొనియాడారు. గురువారం మండల పరిధిలోని వెన్నాచేడ్‌ తదితర గ్రామాల్లో సర్పంచు పుల్లారెడ్డితో పాటు వార్డు మెంబర్లను ఎంపీటీసీని శాలువ, పూల మాలలతో గ్రామ కార్యదర్శి ఖలీల్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచు మాట్లాడుతూ ఐదేళ్లు గ్రామాభివృద్ధికి సహక రించినందుకు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రేణుక, మాజీ సర్పంచు బోయిని గోపాల్‌, మాజీ ఎంపీటీసీ ఆశన్న, వార్డు మెంబర్లు, గ్రామ కోఆప్షన్‌ మెంబర్లు, గ్రామ పెద్దలు శేఖ్‌అలీ, జి.రాములు, నరేందర్‌రెడ్డి, సుభాష్‌, చిన్నయ్య, రాములు, పులీందర్‌రెడ్డి, వెంకటయ్య, మాసయ్య, హెచ్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 11:31 PM