Share News

డ్రగ్స్‌ మహమ్మారిపై ఉక్కుపాదం

ABN , Publish Date - May 30 , 2024 | 11:46 PM

డ్రగ్స్‌ మహమ్మారిని ఉక్కుపాదంతో అణిచివేయనున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్‌ తరుణ్‌ జోషి తెలిపారు. ఘట్‌కేసర్‌ మండలం, అంకుశాపూర్‌లో గురువారం నూతన చట్టాలపై గురువారం పోలీసు సిబ్బందికి సంపూర్ణ పరిజ్ఞానం కోసం ప్రత్యేకసమావేశం నిర్వహించారు.

డ్రగ్స్‌ మహమ్మారిపై ఉక్కుపాదం
మాట్లాడుతున్న రాచకొండ సీపీ తరుణ్‌జోషి

నకిలీ విత్తనాలను అరికట్టెందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

రాచకొండ సీపీ తరుణ్‌ జోషి

ఘట్‌కేసర్‌ రూరల్‌, మే 30 : డ్రగ్స్‌ మహమ్మారిని ఉక్కుపాదంతో అణిచివేయనున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్‌ తరుణ్‌ జోషి తెలిపారు. ఘట్‌కేసర్‌ మండలం, అంకుశాపూర్‌లో గురువారం నూతన చట్టాలపై గురువారం పోలీసు సిబ్బందికి సంపూర్ణ పరిజ్ఞానం కోసం ప్రత్యేకసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ డ్రగ్స్‌ వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని, తెలిసితెలియక యువత మత్తుపదార్థాల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తుపదార్థాలను రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. డ్రగ్స్‌ వాడటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నారు. భారత నేరన్యాయ చట్టాలు- 2023ను వచ్చేనెల ౖ 1 నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణ లో పాటించవలసిన నూతన విధానాలను పోలీసులకు సూచించారు. రాచకొండ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, పోలీసులకు, సిబ్బందికి నూతన చట్టాలకు సంబంధించిన న్యాయశాస్త్ర గంథ్రాలను అన్ని పోలీసుస్టేషన్లకు అందజేయనున్నట్లు తెలిపారు. నకిలీ విత్తనాల క్రయ విక్రయాలపై ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీసీలు రాజేష్‌ చంద్ర, ప్రవీణ్‌కుమార్‌, కరుణాకర్‌, ఇందిరా, అరవింద్‌ బాబు, చంద్రమో హన్‌, మురళీధర్‌, అదనపు డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 11:46 PM