Share News

పక్కాగా ప్రచార వ్యూహం

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:16 AM

త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రచార వ్యూహం పక్కాగా అమలు చేయాలని బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌. సంతోష్‌, రాష్ట్ర పార్టీ ముఖ్యులకు

పక్కాగా ప్రచార వ్యూహం

బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి బి.ఎల్‌. సంతోష్‌ పిలుపు

హైదరాబాద్‌, ఫిబ్రవరి5 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రచార వ్యూహం పక్కాగా అమలు చేయాలని బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌. సంతోష్‌, రాష్ట్ర పార్టీ ముఖ్యులకు పిలుపునిచ్చారు. పార్టీ సంస్థాగత బలోపేతంపై మరింత దృష్టిసారించాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సమన్వయ సమావేశం సంఘ్‌ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. పార్టీలో నూతన సభ్యుల చేరికలపై, కొత్త, పాత నేతల మధ్య సమన్వయంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గడచిన రెండు నెలల్లో పార్టీ నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.

Updated Date - Feb 06 , 2024 | 04:16 AM