Share News

రంగారెడ్డి జిల్లాలోనూ బీఆర్‌ఎస్‌కు షాక్‌!

ABN , Publish Date - Feb 25 , 2024 | 04:55 AM

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్‌ఎ్‌సకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.

రంగారెడ్డి జిల్లాలోనూ బీఆర్‌ఎస్‌కు షాక్‌!

రేవంత్‌ను కలిసిన జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి

ప్రియాంక సమక్షంలో 27న కాంగ్రె్‌సలో చేరిక

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్‌ఎ్‌సకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆపరేషన్‌ ఆకర్ష్‌ను ముమ్మరం చేసిన అధికార కాంగ్రెస్‌ పార్టీ.. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టింది. రెండు వారాల కిందట మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి భార్య వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి హస్తం గూటికి చేరగా... తాజాగా రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి కూడా కాంగ్రె్‌సకు జై కొట్టారు. అనితారెడ్డితోపాటు ఆమె మామ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు మాజీ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని శనివారం కలిశారు. కొద్ది రోజుల కిందటే తీగల కృష్ణారెడ్డి సీఎంను కలిసి కాంగ్రె్‌సలో చేరుతున్నట్లు ప్రకటించినా.. అనితారెడ్డి చేరికపై స్పష్టత రాలేదు. తాజాగా ఆమె సీఎంను కలవడంతో కాంగ్రె్‌సలో ఆమె చేరిక ఖరారైంది. సీఎంను కలిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ నెల 27న ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపైనా కాంగ్రెస్‌ ఫోకస్‌ చేస్తున్నట్లు తెలిసింది. తనకు సన్నిహితులైన కొందరు ఎమ్మెల్యేలతో పట్నం మహేందర్‌రెడ్డి మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల సీఎం రేవంత్‌ను కలిసిన రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే.. ఆ తర్వాత నుంచీ బీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించడం లేదని చెబుతున్నారు. త్వరలోనే కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా, బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌.. సీఎం రేవంత్‌ను కలిశారు. ఆయన వెంట జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 04:55 AM