Share News

నామినేషన్ల ప్రక్రియకు పటిష్ఠ బందోబస్తు

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:38 AM

లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.

 నామినేషన్ల ప్రక్రియకు పటిష్ఠ బందోబస్తు

నామినేషన్ల ప్రక్రియకు పటిష్ఠ బందోబస్తు

నల్లగొండ టౌన, ఏప్రిల్‌ 17: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 25వ తేదీ వరకు జరుగుతుందన్నారు. సెంట్రల్‌ ఫోర్స్‌ ఆర్మ్‌డ్‌, సివిల్‌ ఫోర్స్‌తో మూడంచెల భద్రతా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రిటర్నింగ్‌ కార్యాలయానికి 100 మీటర్ల లోపల అభ్యర్థితో పాటు నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.

Updated Date - Apr 18 , 2024 | 07:48 AM