Share News

Manchiryāla- పోలింగ్‌కు పటిష్టమైన బందోబస్తు

ABN , Publish Date - May 12 , 2024 | 10:56 PM

జిల్లాలో సోమవారం నిర్వహించే పోలింగ్‌కు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు.

Manchiryāla-         పోలింగ్‌కు పటిష్టమైన బందోబస్తు
మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీపీ శ్రీనివాస్‌

ఏసీసీ, మే 12: జిల్లాలో సోమవారం నిర్వహించే పోలింగ్‌కు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ రూట్‌ మొబైల్‌ అధికారులు ఆర్ముడ్‌ అధికారులతో పోలింగ్‌ పరికరాలను పోలింగ్‌ లొకేషన్‌లకు పటిష్టమైన భద్రతతో తీసుకువెళ్లడం జరుగుతుం దన్నారు. భద్రత బందోబస్తు కోసం 832 మంది సివిల్‌ ఫోర్స్‌, 384 మంది వింగ్స్‌ఫోర్స్‌, 300 మంది హోంగార్డులు, 300 మంది శిక్షణ కానిస్టేబుళ్లు, 700 మంది చత్తీష్‌గడ్‌కు చెందిన హోంగార్డు, 91 మంది సింగరేణి కానిస్టేబుళ్లు, 64 మంది స్పెషల్‌ పార్టీ సిబ్బంది , 5 కంపెనీలకు చెందిన 443 మంది కేంద్ర బలగాల సిబ్బంది , మొత్తం 3,300 మందిని నియమించామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాని టరింగ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. కమిషనరేట్‌ పరిధిలోని అన్ని లాడ్జీలు, ఫంక్షన్‌హాళ్లు చెక్‌ చేసి బయటి నుంచి వచ్చిన వ్యక్తులను పంపించామని వివరించారు. మావోయిస్టు ప్రభావిత పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో డ్రోన్‌ పెట్రోలింగ్‌ ఏర్పాటు చేసి నిరం తరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రాములు, ఏసీపీ ప్రకాష్‌, పోలీసులు పాల్గొన్నారు.

ఎన్నికల విధులకు ఎన్‌సీసీ కెడెట్లు

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్‌సీసీ కెడెట్లను సామాజిక సేవ, స్వచ్ఛంద ప్రతిపాదికన విధులకు వినియోగించు కుంటున్నామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం కమిషనరేట్‌ హెడ్‌క్వార్టర్స్‌లో కెడెట్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ క్రమ శిక్షణతో విధులు నిర్వహిస్తూ అందరిదో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ఓటర్లు క్యూ పద్ధతిలో ఉండేలా చూడాలన్నారు. విధులకు హాజరయ్యే 90 మంది కెడెట్లకు పలు సూచనలు చేశారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 10:56 PM