Share News

భారతీయ న్యాయ సంహితపై పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష

ABN , Publish Date - May 15 , 2024 | 02:45 AM

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎ్‌స)-2023, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత(బీఎన్‌ఎ్‌సఎ్‌స)-2023, భారతీయ

భారతీయ న్యాయ సంహితపై పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎ్‌స)-2023, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత(బీఎన్‌ఎ్‌సఎ్‌స)-2023, భారతీయ సాక్ష్య చట్టం-2023పై తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం సమీక్షించారు. ఈ చట్టాలు ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో.. అదనపు డీజీపీలు మహేశ్‌ భగవత్‌, సంజయ్‌కుమార్‌ జైన్‌, సీఐడీ చీఫ్‌ షికాగోయల్‌, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం వీటిపై సమీక్ష నిర్వహించారు. ఈ మూడు చట్టాల్లో ఒక్కోదాని అమలు తీరుతెన్నుల పర్యవేక్షణకు ఒక్కో డీజీపీని ఇన్‌చార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నాటికి అన్ని పోలీ్‌సస్టేషన్లలో కొత్త చట్టాల మేరకు కేసుల నమోదుకు రూట్‌మ్యా్‌పను సిద్ధం చేయనున్నారు.

Updated Date - May 15 , 2024 | 09:31 AM