Share News

కాలంతో పయనించేవాడే కవి

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:11 PM

కాలంతో పయనించేవాడే కవి అని, కాలానుగుణంగా వర్తమాన అంశాల్ని ఒడిసి పట్టుకుని కవిత్వం రాయడమే కవి పని అని ప్రముఖ సామాజిక వేత్త, దక్కన్‌ ల్యాండ్‌ మాసపత్రిక సంపాదకులు మణికొండ వేదకుమార్‌ పేర్కొన్నారు.

కాలంతో పయనించేవాడే కవి
మాట్లాడుతున్న మణికొండ వేదకుమార్‌

- ప్రముఖ సంపాదకుడు మణికొండ వేదకుమార్‌

మహబూబ్‌నగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 7 : కాలంతో పయనించేవాడే కవి అని, కాలానుగుణంగా వర్తమాన అంశాల్ని ఒడిసి పట్టుకుని కవిత్వం రాయడమే కవి పని అని ప్రముఖ సామాజిక వేత్త, దక్కన్‌ ల్యాండ్‌ మాసపత్రిక సంపాదకులు మణికొండ వేదకుమార్‌ పేర్కొన్నారు. స్థానిక లుంబిని పాఠశాలలో పాలమూరు సాహితి సంయుక్త ఆధ్యర్యంలో ఆదివారం నిర్వహించిన శ్రీ క్రోధి నామ ఉగాది సంవత్సర ఉగాది కవిసమ్యేళన కార్యకరమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్తమాన సమస్యలను ప్రపంచా నికి చాటే విధంగా కవి ప్రయత్నిస్తాడని ఆ ప్రయత్నంలోనే భాగంగానే సమాజ మార్పును కవి ఆహ్వానిస్తాడని ఆయన అన్నారు. అలాగే పర్యావరణానికి అను కూలంగా కవులు కవిత్వం రాయాలన్నారు. అప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుందన్నారు. సభకు కె. లక్ష్మన్‌గౌడ్‌ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం లో తెలుగు శాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎస్‌.రఘు విశిష్ట అతిథి ప్రముఖ న్యాయవాది మనోహర్‌రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథు లు కోట్ల వెంటేశరరెడ్డి, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్‌, డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌, వనపట్ల సుబ్బయ్య, తదితరులు ప్రసంగించారు.

ధూప, దీప నైవేద్య అర్చక సంఘం కమిటీ ఎంపిక

స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం ధూప, దీప నైవేద్య అర్చక సంఘం కమిటీ సమావేశం జరిగింది. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా జంగం మహేష్‌, వర్కింగ్‌ ప్రసిడెంట్‌గా జి. రవికుమార్‌, ప్రధాన కార్యదర్శిగా మఠం కుమారస్వామి, కోశాధికారిగా అయ్యవారి పవన్‌కుమర్‌ చార్యులు ఎన్నికైన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 11:12 PM