Share News

తెలంగాణ మహిళల విలువ తీసిన కవిత

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:30 PM

లిక్కర్‌ దందాతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దేశంలో తెలంగాణ మహిళల పరువు తీసిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ మహిళల విలువ తీసిన కవిత
సల్లోనిపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

హన్వాడ, ఏప్రిల్‌ 30 : లిక్కర్‌ దందాతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దేశంలో తెలంగాణ మహిళల పరువు తీసిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సల్లోనిపల్లి, దొర్రితండా, యారోనిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఓటర్లను కలిసి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవిత అక్రమ మార్గంలో లిక్కర్‌ వ్యాపారాన్ని ఢిల్లీలో పెట్టి అడ్డంగా దొరికి తీహర్‌ జైల్లో ఊచలు లెక్కపెడుతోందని ఆరోపించారు. తెలంగాణలో కారు పని అయిపోయిందని, కమలానికి అక్కడక్కడా పిల్లలు మాత్రమే ఉన్నారని, కాంగ్రెస్‌ కు ఊరూరా నాయకులు, ప్రజలు ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. మోదీ అయోధ్య లో గుడి కట్టారని, అందుకే మోదీకి ఓటు వేయాలని చెబుతున్నారని, బీజేపీ నా యకులు గ్రామానికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు. మన పిల్లల భవిష్యత్‌ కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. లంబాడీల కోసం కాంగ్రెస్‌ ఎంతో చేసిందన్నారు. పిల్లల ఉన్నత చదువుల కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పా రు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానని అన్నారు. ఆరు గ్యారెంటీలు అమ లు చేస్తామన్నారు. ఆగస్టు వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్యే పే ర్కొన్నారు. చల్ల వంశీచంద్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అందిస్తే బీజేపీ తొలగించేందుకు కుట్ర చేస్తోందని అన్నారు. ఆయా గ్రామాలలో యెన్నం సమక్షంలో పలువురు కాంగ్రె స్‌ పార్టీలో చేరారు. పార్టీ జిల్లా నాయకుడు ఎం.సురేందర్‌రెడ్డి, మండల అధ్య క్షుడు మహేందర్‌, చెన్నయ్య, కృష్ణయ్య, రఘుపతిరెడ్డి, కేశవులు, కలీం, యాద య్య,లక్ష్మన్‌నాయక్‌, షబ్బీర్‌ హుస్సేన్‌, లక్ష్మన్‌, అంజమ్మ, ఆనంద్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 11:30 PM