చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు
ABN , Publish Date - Sep 09 , 2024 | 12:50 AM
చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అక్కంపల్లి రిజర్వాయర్ ప్రధాన గేట్ల వద్ద ఆదివా రం సాయంత్రం జరిగింది.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు
కొనసాగుతున్న సహాయక చర్యలు
లభించని ఆచూకీ
పెద్దఅడిశర్లపల్లి,సెప్టెంబరు 8: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అక్కంపల్లి రిజర్వాయర్ ప్రధాన గేట్ల వద్ద ఆదివా రం సాయంత్రం జరిగింది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం... దేవరకొండ పట్టణానికి చెందిన అవివాహితుడైన మహ్మద్ జుబేర్(47) కూలీ పనులు చేసుకుం టూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతని స్నేహితుడు ఆదీ్‌ఫతో కలిసి దేవరకొండ నుంచి సా యంత్రం చేపలు పట్టేందుకు అక్కంపల్లి రిజర్వాయర్ వద్దకు వచ్చారు. ప్రధాన గేట్ల వద్ద గ ల కాల్వ దిగువన చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కాల్వ పడి గల్లంతయ్యాడు. వెంటనే అతని స్నేహితుడు ఆరీఫ్ పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని స హాయక చర్యలు ముమ్మరం చేశారు. నీటిపారుదల అధికారులతో మాట్లాడి రిజర్వాయర్ గే ట్లను ముసివేశారు. అయితే రాత్రి కావడంతో గాలింపు చర్యలు మందగించాయి. రాత్రి పొ ద్దుపోయే వరకు మృతదేహం లభ్యం కాలేదు.