Share News

Manchiryāla- ముహూర్తాల కాలం

ABN , Publish Date - Feb 07 , 2024 | 09:58 PM

జిల్లాలో వివాహాల కోలాహ లం ఆరంభం కానుంది. ఈ నెల 11వ తేదీ నుంచి మాఘ మాసం ప్రారంభం అవుతుండగా వివాహాలకు అది ఎంతో శుభ ప్రదమైనది. మాఘ మాసంలో వివాహాలు జరిపించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు సన్నద్ధం అవుతున్నారు.

Manchiryāla-    ముహూర్తాల కాలం
లోగో

- మూడు నెలల్లో 30 ముహూర్తాలు

- ఆ తరువాత మూఢం, శూన్య మాసం

- తిరిగి శ్రావణ మాసంలోనే మంచి రోజులు

- ముందస్తుగా ఫంక్షన్‌ హాళ్ల బుకింగ్‌

మంచిర్యాల, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివాహాల కోలాహ లం ఆరంభం కానుంది. ఈ నెల 11వ తేదీ నుంచి మాఘ మాసం ప్రారంభం అవుతుండగా వివాహాలకు అది ఎంతో శుభ ప్రదమైనది. మాఘ మాసంలో వివాహాలు జరిపించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు సన్నద్ధం అవుతున్నారు. చాలా రోజుల తరువాత మంచి రోజులు వస్తుండడంతో పిల్లల పెళ్లిళ్లు చేసేందుకు తల్లిదండ్రులు ఆరాట పడు తున్నారు. మాఘ మాసం వసంత రుతువులో ప్రారంభం అవు తుంది. శీతాకాలం, వేసవి కాలం మధ్యలో వస్తున్నందున ఆ సమయం వివాహాలకు అత్యంత అను కూలంగా ఉండటంతో పండితులు ఆ సమయంలోనే అధిక ముహూర్తాలు పెడుతుంటారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా ఇన్ని రోజులు ముహూర్తాలు లేకపోవడంతో అనేక మంది మాఘ మాసం కోసం వేచి చూస్తున్నారు.

ఉగాది వరకు..

మాఘ మాసం మొదలుకొని ఉగాది వరకు మహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో 11వ తేదీ మొదలుకొని 14, 15, 16, 18, 19, 25, 26, 28, 29 వరకు మంచి ముహూర్తాలు ఉన్నట్లు వేద పండితులు చెబుతున్నారు. అలాగే మార్చి నెలలో 2, 8, 13, 15, 16, 18, 27, 28, 29, 30, 31 వరకు మంచి ముహూర్తాలు ఉండగా, ఏప్రిల్‌లో 3, 4, 5 వరకు ముగుస్తుండగా, అనంతరం ఉగాది తరువాత మరిన్ని ము హూర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఆయా తేదీల్లో వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభ కార్యాలు జరిపించేందుకు మంచి ము హూర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ తేదీల తరువాత ముహూర్తాలు ముగియనున్నాయి. మూఢం ప్రవేశించనుండగా. దాన్ని శూన్యమాసంగా పండితులు చెబుతున్నారు. పైగా శుభ కార్యాలు నిర్వహించేందుకు అది అననుకూల సమయం కావడంతో పై తేదీల్లోనే వివాహాలు జరిపించేలా పండితులు ముహూర్తాలు ఖరారు చేశారు. ఈ ముహూర్తాలు తప్పితే, తిరిగి శ్రావణ మాసం వరకు వేచి ఉండాల్సిందే. శ్రావణ మాసంలో మళ్లీ మంచి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు స్పష్టం చేస్తున్నారు.

ఊపందుకున్న బుకింగులు...

ముహూర్తాలు ప్రారంభం కానుండడంతో వివాహాలు జరిపించే కుటుంబాలు ఫంక్షన్‌ హాళ్లను ముందస్తుగా బుక్‌ చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఉన్న ఫంక్షన్‌ హాళ్లన్నీ నాలుగైదు నెలలు ముందుగానే బుక్‌ అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రెండు నుంచి మూడు తేదీలు ఖరారు చేసుకుని, వాటి ఆధారంగా ఫంక్షన్‌ హాళ్లను ముందస్తుగా బుక్‌ చేసుకున్నారు. చాలా కాలం తరు వాత మంచి రోజులు వస్తుండడం, కేవలం 30 ముహుర్తాలే ఉండ డంతో... ఇదే అదునుగా ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులు కూడా రేట్లు పెంచి మరీ వసూలు చేస్తున్నారు. ఫంక్షన్‌ హాలు స్థాయిని భట్టి, పలు రకాల రేట్లలో అందుబాటులో ఉన్నాయి. ఫంక్షన్‌ హాళ్లతోపాటు బ్యాండ్‌ మేళాలు, డీజేలు, టెంట్‌ హౌజ్‌, క్యాటరింగ్‌, వెడ్డింగ్‌ కార్డుల ముద్రణ, తదితర ఏర్పాట్లలో ప్రజలు నిమగ్నమయ్యారు.

ముహూర్తాలు తక్కువే...

ఈ యేడాది వివాహ ముహూర్తాలు తక్కువగానే ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. మాఘ మాసం ప్రారంభమవుతున్న ఈనెల 11వ తేది నుంచి శ్రీకోధ నామ సంవత్సర చైత్ర మాసం వరకూ అంటే ఏప్రిల్‌ 26వ తేదీ వరకు మూడు నెలల్లో కేవలం సుమారు 30 వివాహ ముహూర్తాలు మాత్రమే ఉన్నాయంటున్నారు. ఏప్రిల్‌ 28వ తేదీ నుంచి మూఢం ప్రారంభం కానుంది. దీంతో వైశాఖం, జ్యేష్ట మా సాల్లో వివాహ ముహూర్తాలు లేవని పంచాంగ కర్తలు వివరిస్తున్నారు. ఆ తరువాత ఆషాఢం శూన్య మాసం కావడంతో శుభకార్యాలకు పనికి రాదని, మళ్లీ శ్రావణ మాసం అంటే ఆగస్టు నుంచి తిరిగి వివాహాలు జరిపించుకోవచ్చని పురోహితులు చెబుతున్నారు. సాధారణంగా ఏటా చైత్ర శుద్ధ నవమి అంటే శ్రీరామ నవమి అనంతరం వివాహాధి శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ఆ తరు వాత వైశాఖ మాసం వేస వికాలం అయినప్పటికీ వివాహాలు ఎక్కువ గానే ఉన్నాయి. అయితే ఈ సారి వైశాఖ మాసం అంతా మూఢం కావడంతో వివాహాలన్నీ చైత్రం లో అంటే ఏప్రిల్‌ 26వ తేదీ లోపే జరిగే అవకాశం ఉంది.

Updated Date - Feb 07 , 2024 | 09:59 PM