Share News

భక్తులతో పోటెత్తిన ఏకశిలా పర్వతం

ABN , Publish Date - Apr 08 , 2024 | 11:29 PM

కులకచర్ల మండలంలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. పది రోజులుగా సాగుతున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఏకశిలా పర్వతం పాంబండ భక్తులతో పోటెత్తింది.

 భక్తులతో పోటెత్తిన ఏకశిలా పర్వతం
అగ్ని గుండంలో నడుస్తున్న భక్తులు

కులకచర్ల, ఏప్రిల్‌ 8:కులకచర్ల మండలంలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. పది రోజులుగా సాగుతున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఏకశిలా పర్వతం పాంబండ భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజామున అగ్నిగుండం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ పాలకవర్గం సభ్యులు సన్మానించారు. కోనేరులో స్నానం చేసిన భక్తులు శ్రీరామలింగేశ్వరస్వామి దర్శనం కోసం బారులు తీరారు. సాయంత్రం వరకు భక్తుల తాకిడి కొనసాగింది. ఆలయ చైర్మన్‌ నర్సమ్మరాములు, ఏవో సుధాకర్‌ పర్యవేక్షించారు. కృష్ణవేణి ట్యాలెంట్‌ పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీమ్‌రెడ్డి, కులకచర్ల ఎంపీటీసీ ఆనంద్‌, కాంగ్రెస్‌ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్‌నాయక్‌, సంజీవ్‌రెడ్డి, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 11:29 PM