Share News

ఘనంగా సామూహిక కుంకుమార్చన

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:10 AM

శాలిగౌరారం మండలం వల్లాలలోని శ్రీ పార్వతీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలలో భా గంగా 8వ రోజు శుక్రవారం మహిళల సామూహిక కుంకుమార్చనతో పాటు దే వత మూర్తుల, ప్రభల ఊరేగింపు కన్నుల పండుగగా నిర్వహించారు.

  ఘనంగా సామూహిక కుంకుమార్చన
వల్లాలలో నిర్వహించిన సామూహిక వ్రతాల్లో పాల్గొన్న మహిళలు

ఘనంగా సామూహిక కుంకుమార్చన

శాలిగౌరారం, మార్చి 15: శాలిగౌరారం మండలం వల్లాలలోని శ్రీ పార్వతీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలలో భా గంగా 8వ రోజు శుక్రవారం మహిళల సామూహిక కుంకుమార్చనతో పాటు దే వత మూర్తుల, ప్రభల ఊరేగింపు కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రభల ఊరేగింపులో దాదాపు 50ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు అందంగా అలకరించి ప్రదర్శించా రు. మహిళా కోలాటల బృందాలు, భజన బృందాల నృత్యాలతో వైభవంగా యా త్ర కొనసాగింది.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి దాదాపు 500మంది మహిళలు భారీ ఎత్తున తరలి వచ్చి శివాలయంలో కుంకుమార్చన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప, ఎంపీటీసీ మాదగోని కవిత రామలింగయ్య, ఆలయ పూజారులు, శివ స్వాములు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 12:10 AM