Share News

త్వరలో గల్ఫ్‌కు రాష్ట్ర మంత్రుల బృందం!

ABN , Publish Date - Apr 04 , 2024 | 05:19 AM

గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసీయుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌, ప్రభుత్వ మాజీ విప్‌ ఈరవత్రి

త్వరలో గల్ఫ్‌కు రాష్ట్ర మంత్రుల బృందం!

ప్రవాసీయులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసీయుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌, ప్రభుత్వ మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌ కుమార్‌ ఆఽధ్వర్యంలో గల్ఫ్‌ ప్రవాసీయుల బృందం ముఖ్యమంత్రిని బుధవారం కలిసింది. గల్ఫ్‌ దేశాల్లో మరణించిన తెలంగాణ పౌరులకు చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు పరిహారం ఇవ్వడాన్ని హర్షిస్తూ సీఎంకు ధన్యవాదాలు తెలియజేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గల్ఫ్‌ పర్యటనకు రావాలని ప్రవాసీయుల బృందం సీఎంను ఆహ్వానించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన వారు గల్ఫ్‌ దేశాల్లో అత్యధికంగా నివసిస్తున్నారని, ఎన్నికల్లో బీజేపీ ప్రధాన పోటీదారు కావడడంతో గల్ఫ్‌ రావాలని కోరింది. అయితే, ప్రస్తుతం గల్ఫ్‌ పర్యటనకు రాలేనన్న సీఎం రేవంత్‌ రెడ్డి.. తనకు బదులుగా మంత్రులు, ఎమ్మెల్యేల బృందాన్ని త్వరలోనే పంపిస్తానని చెప్పారని ప్రవాసీయుల బృందం తెలియజేసింది. అంతేకాక, గల్ఫ్‌ దేశాలకు చెందిన ప్రవాసీ ప్రముఖులతో త్వరలో సమావేశం అయ్యేందుకు సీఎం సముఖత వ్యక్తం చేశారని పీసీసీ గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్లు మంద భీంరెడ్డి, సింగిరెడ్డి నరేశ్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - Apr 04 , 2024 | 05:19 AM