Share News

నాలుగేళ్ల పరిపాలనపై పూర్తి విచారణ చేయిస్తా

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:21 PM

కొల్లాపూర్‌ మునిసి పాలిటీలో గడిచిన నాలుగేళ్ల పరిపాలనపై పూర్తి వి చారణ చేయిస్తానని ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృ తి క, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ న్నారు.

నాలుగేళ్ల పరిపాలనపై పూర్తి విచారణ చేయిస్తా
మునిసిపల్‌ బడ్జెట్‌ సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- ప్రజలకు నష్టం కలిగించే కార్యక్రమాలు చేయను

- మంత్రి జూపల్లి కృష్ణారావు

- కొల్లాపూర్‌ మునిసిపాలిటీలో

రూ. 7కోట్ల 22లక్షల 53వేలతో బడ్జెట్‌ అంచనా

కొల్లాపూర్‌, ఫిబ్రవరి 20 : కొల్లాపూర్‌ మునిసి పాలిటీలో గడిచిన నాలుగేళ్ల పరిపాలనపై పూర్తి వి చారణ చేయిస్తానని ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృ తి క, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ న్నారు. మంగళవారం పట్టణంలోని నూతన గ్రంథా లయ భవనంలో జరిగిన మునిసిపల్‌ 2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ సమావేశాల కు ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు, అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రఘుప్రోలు వి జయలక్ష్మీ, వైస్‌ చైర్‌పర్సన్‌ మహెముదాబేగం, ము నిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌ మంత్రి జూపల్లికి మర్యాదపూర్వకంగా పూల మొక్కలు అందజేసి స్వా గతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ప్రజలకు నష్టం కలిగించే కార్యక్ర మాలు చేయనని, తనకు తెలియకుండా తనపేరు చెప్పి ప్రజలకు ఇబ్బందులకు గురి చేసేలా ము నిసిపాలిటీకి చెడ్డపేరు తెచ్చేలా తనకు చెడ్డపేరు వచ్చేలా ఎవరైనా తప్పుడు పనులు చేస్తే ఉపే క్షించేది లేదని అధికారులు వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో స మష్టి నిర్ణయాలు తీసుకుని ప్రజల సమస్యలు పరి ష్కరించాలన్నారు. ఎన్నికల ముందు ప్రజల దగ్గర కు ఎలా వెళ్లడం జరిగిందో అదేవిధంగా అన్ని వా ర్డులు తిరుగుతూ వారి సమస్యల పరిష్కారం కోసం బాధ్యతాయుతంగా పని చేయాలని జూపల్లి పేర్కొన్నారు. కొల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలో తాగునీటి అవసరాల కోసం తన సొంత నిధుల నుంచి రూ. 25లక్షలు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మునిసిపాలిటీ ఆదాయ వ్య యాలకు సంబంధించి గడిచిన నాలుగేళ్ల క్రితం రూ. 23లక్షల తైబజార్‌ ఆదాయం వచ్చేదని నేడు మార్కెట్‌ పెరిగిన నాలుగేళ్ల తర్వాత తైబజార్‌ ఆదా యం రూ. పది లక్షలకు తగ్గిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కొల్లాపూర్‌ మునిసిపా లిటీ ఆదాయం పెరిగేలా అధికారులు పని చేయా లని, పట్టణంలో మునిసిపాలిటీ ఆధ్వర్యంలో పబ్లిసి టీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి దానికి వచ్చే ఆదా యాన్ని మునిసిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చే యాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కొ ల్లాపూర్‌ పట్టణంలో మౌలిక వసతులు తీర్చుకు నే లా బాత్రూమ్‌లు నిర్మించాలని జూపల్లి అధికారుల ను ఆదేశించారు. గడిచిన పది సంవత్సరాల నుండి మునిసిపల్‌ ఆదాయ, వ్యయాలపై పూర్తి సమాచా రంతో అధికారులు సిద్దంగా ఉండాలని త్వరలోనే తాను సమీక్ష నిర్వహిస్తానని జూపల్లి అధికారులను ఆదేశించారు. 2024-25సంవత్సరానికి సంబంధించి మునిసిపాలిటీ అంచనా బడ్జెట్‌ 7కోట్ల 22లక్షల 53వేల రూపాయలతో బడ్జెట్‌ సమావేశంలో ముని సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో అంచనా ఆదాయాలు, అంచనా ఖర్చు వివరాలను పొందుపర్చారు. మునిసిపల్‌ పాలక మండలి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం కొల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు చెందిన కౌన్సిలర్లు మంత్రి జూపల్లి దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కారం కోసం అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కౌన్సిలర్లు, మునిసిపల్‌ కో ఆప్షన్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:21 PM