Share News

మోదీ పాలనలో ఆర్థికశక్తిగా ఎదిగిన దేశం

ABN , Publish Date - May 16 , 2024 | 11:26 PM

ప్రధాని నరేంద్ర మోదీ పాలనలోనే దేశం 5వ ఆర్థిక శక్తిగా ఎదిగిందని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు.

 మోదీ పాలనలో ఆర్థికశక్తిగా ఎదిగిన దేశం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

మోదీ పాలనలో ఆర్థికశక్తిగా ఎదిగిన దేశం

మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి రాజేందర్‌

రామగిరి, మే 16: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలోనే దేశం 5వ ఆర్థిక శక్తిగా ఎదిగిందని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నల్లగొండ పట్టణానికి వచ్చా రు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రే మేందర్‌ బీజేపీలో 40 సంవత్సరాలుగా ఒడిదుడుకులు, కష్ట నష్టాలు ఎదురైనా బెదరకుండా పార్టీ సిద్ధాంతం కోసం పని చేశా రని కొనియాడరు. ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాలోని 34 నియోజకవర్గాలో 34 ఇనచార్జులు 10 రోజులుగా ప్రేమేందర్‌ గె లుపునకు పనిచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో యువతలో బీజేపీనే గెలిపించాలన్న సంకల్పం బలంగా ఉందన్నారు. మోదీ నాయకత్వంలో ఆత్మగౌరవం పెరగడమే కాకుండా దే శాన్ని సమున్నత్తంగా నిలిపారని పేర్కొన్నారు. ఇక తె లంగాణలో అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీ కొ ట్టించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రేవంతరెడ్డి అని అన్నారు. అలవీకాని హామీలతో ప్రజలను బురి డి కొట్టించారని విమర్శించారు. కేసీఆర్‌ మీద వ్యతిరేకతతోనే ప్రజలు గతి లేక కాంగ్రె్‌సకి ఓటు వేశారు తప్ప ఇష్టంతో ఎవరూ వేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలనలో కాలిపోయిన మోటార్లు, ఎండిపోయిన పం టలు దర్శనమిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో 12 స్థానాల్లో బీజేపీ గెలవబోతుందన్నారు. సమావేశం లో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, నాయకులు వెం కటేష్‌ మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి గె లిపించుకోవాలని సూచించారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమందర్‌రెడ్డి మాట్లాడుతూ మే ధావులు, యువత ఈ ఎన్నికల్లో మొదటి ప్రా ధాన్యత ఓటు వే సి గెలిపించాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షితరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ నల్ల గొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, రాష్ట్ర నాయకులు గోలి మ ధుసూదనరెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్‌, పిల్లి రామరాజు, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, నూకల వెంకటనారాయణరెడ్డి, పల్లెబోయిన శ్యాం సుందర్‌, వంగూరి రాఖీ, పోతేపాక సాంబయ్య, పెరిక మునికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2024 | 11:26 PM