Share News

జమిలి పేరుతో రాషా్ట్రల హక్కులను హరించే కుట్ర

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:57 AM

జమిలి ఎన్నికల పేరుతో మోదీ ప్రభుత్వం రాషా్ట్రల హక్కులను హరించే కుట్ర చేస్తోందని సీపీ ఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

 జమిలి పేరుతో రాషా్ట్రల హక్కులను హరించే కుట్ర
సమావేశంలో మాట్లాడుతున్న తుమ్మల వీరారెడ్డి

జమిలి పేరుతో రాషా్ట్రల హక్కులను హరించే కుట్ర

సీపీఏం జిల్లా కార్యదర్శి తుమ్మల

హాలియా, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): జమిలి ఎన్నికల పేరుతో మోదీ ప్రభుత్వం రాషా్ట్రల హక్కులను హరించే కుట్ర చేస్తోందని సీపీ ఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హాలి యాలో ఆదివారం నిర్వహించిన సీపీఏం మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్లమెంట్‌లో అమితషా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవహేళన చేశారని, తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని అన్నా రు. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పన్ను పేరుతో ఏకచత్రాధిపత్యం కొనసాగించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేశారని, 44 కార్మిక చట్టాలు నాలుగు కోడ్స్‌గా కుదించి కార్మిక హక్కులు కాలరాసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలుచేయాలని, రైతు భరోసా వెంటనే రైతులకు అందించాలని అన్నారు. ప్రస్తుతం చే పడుతున్న ఇంటింటి సర్వేలో అధికారులతో గ్రామసభలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్‌ చేశారు. అటవీ భూములకు హక్కు పత్రాలు కలిగిన రైతులకు భూమాతలో వెంటనే పట్టాదారు పాస్‌పుస్తకం అందించాలని డిమాండ్‌ చేశారు. హాలియాలో 48 సర్వే నెంబర్‌లో ఉన్న పేదలకు తక్షణమే ఇంటి పట్టాలు అందించి డ్రైనేజీ, కరెంట్‌, మౌలిక సదుపాయాలు క ల్పించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కూనరెడ్డి నాగిరెడ్డి, మండల కార్యదర్శి అవుతా సైదులు, నాయకులు కత్తి శ్రీనివా్‌సరెడ్డి, రెబెల్లి వెంకటేశ్వర్లు, పొదిల వెంకన్న, కారంపూడి ధనమ్మ, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 12:57 AM