Share News

Kumaram Bheem Asifabad-

ABN , Publish Date - Feb 06 , 2024 | 09:28 PM

ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో -2024లో భాగంగా ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు.

Kumaram Bheem Asifabad-
మాట్లాడుతున్న కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 6: ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో -2024లో భాగంగా ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల కలెక్టరేట్‌ చాంబర్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా రూపకల్పనపై మంగళవారం సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటరు జాబితా రూపకల్పనలో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పని చేసి స్పష్టమైన జాబితా రూపొందించాలని అన్నారు. ఎస్‌ఎస్‌ఆర్‌-2024లో నూతన ఓటరు నమోదు కొరకు జిల్లాలోని రెండు నియోజక వర్గ నియోజక వర్గాల నుంచి9,238 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. 8,829 దరఖాస్తులను అర్హులుగా గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేశామని తెలిపారు. ఓటరు జాబితా నుంచి తొలగింపు కోసం ఫారం.7 ద్వారా 7,551 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 7,424 దరఖాస్తులకు సంబంఽధించి నోటీసులు జారీ చేసి తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 123 దరఖాస్తులు తిరస్కరించామని తెలిపారు. పేర్లు, చిరునామా సవరణలకు 4,496 దరఖాస్తులు రాగా 4,279 పరిష్కరించామని, 217 తిరస్కరించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 676 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఓటు వేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్‌లో నమునా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 09:28 PM