రేవంత్‌పై చీటింగ్ కేసు పెట్టాలి: హరీశ్‌రావు
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:47 AM
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలనిచ్చి వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను రేవంత్‌రెడ్డి మోసం చేశారని, ఆయనపై చీటింగ్ కేసు పెట్టాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా

రూ.100 కోట్లతో పేద విద్యార్థుల చదువులకు సాయం
గజ్వేల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి హామీ
గజ్వేల్, ఏప్రిల్ 2: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలనిచ్చి వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను రేవంత్‌రెడ్డి మోసం చేశారని, ఆయనపై చీటింగ్ కేసు పెట్టాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో గజ్వేల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎన్నో అబద్ధపు, మోసపూరిత హామీలతో రేవంత్ గద్దెనెక్కారని ఆరోపించారు. రూ.2లక్షల రుణమాఫీ అయినోళ్లు కాంగ్రె్‌సకు, కానోళ్లు బీఆర్‌ఎ్‌సకు లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలని అన్నారు. దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని హరీశ్ విమర్శించారు. కేసీఆర్ చేసిన యాగాలు ఎవరైనా చేశారా అని ప్రశ్నించారు. గజ్వేల్ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని హరీశ్‌రావు భరోసానిచ్చారు. సమావేశంలో వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సేవ చేసేందుకు పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, రూ.వంద కోట్లతో నిరుపేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయం చేస్తానన్నారు. యువతకు పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తానని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.