వెలిచాల రాజేందర్‌రావుపై కేసు నమోదు
ABN , Publish Date - May 04 , 2024 | 04:56 AM
కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుపై కరీంనగర్ రెండో ఠాణాలో ఎన్నికల ప్రవర్తనా నియామావళి
కరీంనగర్ క్రైం, మే 3: కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుపై కరీంనగర్ రెండో ఠాణాలో ఎన్నికల ప్రవర్తనా నియామావళి ఉల్లంఘన కింద శుక్రవారం కేసు నమోదైంది. రాజేందర్‌రావు సోషల్ మీడియా ఖాతా నుంచి కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అనని మాటలు అన్నట్లుగా ఫేక్ వీడియో, కాల్‌రికార్డులు సృష్టించి పోస్ట్ చేశారని బీజేపీ నాయకుడు కొట్టె మురళీకృష్ట రెండు రోజుల క్రితం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎంసీసీ 171 ఎఫ్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.