Share News

పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:13 AM

పార్లమెంటులో బీ సీ బిల్లు ప్రవేశపె ట్టాలని తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం అ ధ్యక్షుడు నీల వెం కటేష్‌ ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు.

 పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న నీల వెంకటేష్‌

పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి

బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్‌ ముదిరాజ్‌

నల్లగొండ టౌ న, జనవరి 20: పార్లమెంటులో బీ సీ బిల్లు ప్రవేశపె ట్టాలని తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం అ ధ్యక్షుడు నీల వెం కటేష్‌ ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. జనగణనలో కులగణన చేయాలని, బీసీ ఉ ద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రబడ్జెట్‌లో బీసీల సంక్షే మం, అభివృద్ధికి రూ. 2లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి 5,6 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి పార్లమెంట్‌ వద్ద ధర్నా చేపట్టను న్నట్లు తెలిపారు. బీసీ బిల్లు కోసం 30 సంవత్సరాలుగా ఆందోళనలు చేపడుతు న్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ బీసీ కులగణన, పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెడతామని ప్ర కటిస్తుందో ఆ పార్టీకే బీసీలు మద్దతు ఉంటుందన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, నాయకులు గుండు వెంకటేశ్వర్లు, సిం గం లక్ష్మి, బక్కతట్ల వెంకన్నయాదవ్‌, ఖమ్మంపాటి దుర్గ, వల్లకీర్తి శ్రీనివాస్‌, పగి ళ్ల కృష్ణ, పున్న వీరేశం, వనం లలిత, సతీష్‌ యాదవ్‌, చెరుపల్లి సదానందు, కర్నా టి మత్స్యగిరి, గడ్డం దశరథ, గోడ శివ, రమణ పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2024 | 12:13 AM