Share News

‘పది’ ఫలితాల్లో 91.57 శాతం ఉత్తీర్ణత

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:30 PM

పదో తరగతి వార్షిక పరీక్ష 2024 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 91.57 శాతం ఉత్తీర్ణులయ్యారు.

 ‘పది’ ఫలితాల్లో 91.57 శాతం ఉత్తీర్ణత

- పదర, ఉప్పునుంతల మండలాల్లో వంద శాతం పాస్‌

- రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 23వ స్థానం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 30: పదో తరగతి వార్షిక పరీక్ష 2024 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 91.57 శాతం ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో మొత్తం 10,507 మంది విద్యార్థులకు గాను 9,621 మంది పాసయ్యారు. పాసైన వారిలో 4,695 మంది బాలురు ఉండగా, 4,926 మంది బాలికలు ఉన్నారు. పది ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లాకు 23వ స్థానం లభించింది. జిల్లాలో పదర, ఉప్పునుంతల మండలాల్లో వంద శాతం మంది విద్యార్థులు పాసవగా, చారకొండ మండలంలో అత్యల్పంగా 79.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యాయి. అత్యల్పంగా ఫలితాలు సాధించిన చారకొండ మండలంలో మొత్తం విద్యార్థులు 202 మందికి గాను 160 మంది పాసవగా 42 మంది విద్యార్థులు ఫెయిల య్యారు. జిల్లా విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించి మండలాల విద్యార్థులను జిల్లా విద్యాధికారి గోవిందరాజులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

మండలాల వారీగా..

తెలకపల్లి మండలంలో 94.2శాతం, ఉప్పు నుంతల మండలంలో వందశాతం, పెద్ద కొత్తప ల్లి మండలంలో 92.83శాతం, కల్వకుర్తిలో 84.14 శాతం, వంగూరు మండలంలో 92 శాతం, లింగాల, 95శాతం, బిజినేపల్లి మండలంలో 88 శాతం, కోడేరు మండలంలో 93.03శాతం ఉత్తీర్ణ త, అలాగే తిమ్మాజిపేట, అచ్చంపేట, కొల్లాపూర్‌, వెల్దండ, చారకొండ పలు మండలాల విద్యార్థు లు ఉత్తమ ఫలితాలు సాధించారు.

Updated Date - Apr 30 , 2024 | 11:30 PM