8 నుంచి ఎస్‌ఏ- 2 పరీక్షలు
ABN , Publish Date - Apr 02 , 2024 | 04:39 AM
రాష్ట్రంలోని పాఠశాలల్లో 8వ తేదీ నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్‌ను
హైదరాబాద్, 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాఠశాలల్లో 8వ తేదీ నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 8 నుంచి 19వ తేదీ వరకు ఎస్‌ఏ-2 పరీక్షలను నిర్వహించనున్నారు. 1 తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, 8వ తరగతి వారికి ఉదయం 9 నుంచి 11.45 గంటల వరకు, 9వ తరగతి వారికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.