Share News

లోక్‌ అదాలతలో 701 కేసులు పరిష్కారం

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:53 PM

మిర్యాలగూడ కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లో క్‌అదాలతలో 701 కేసులు పరిష్కరించినట్లు న్యాయ సేవా సంస్థ చైర్మన, ఐదవ అదనపు జిల్లా జడ్జి జి. వే ణు తెలిపారు.

 లోక్‌ అదాలతలో 701 కేసులు పరిష్కారం
సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి వేణు

లోక్‌ అదాలతలో 701 కేసులు పరిష్కారం

మిర్యాలగూడ లీగల్‌, జూన 8: మిర్యాలగూడ కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లో క్‌అదాలతలో 701 కేసులు పరిష్కరించినట్లు న్యాయ సేవా సంస్థ చైర్మన, ఐదవ అదనపు జిల్లా జడ్జి జి. వే ణు తెలిపారు. అంతకు ముందు లోక్‌అదాలతను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి లోక్‌అదాలత ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కక్షిదా రులు తమ కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకొని సుఖమయ జీవితాన్ని గడపాలన్నారు. లోక్‌అదాలతలో సీనియర్‌ సివిల్‌ జడ్జి బి.సుజయ్‌, ప్ర ధా న జూనియర్‌ సివిల్‌ జడ్జి స్వర్ణలత, రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి అ పూర్వరవళి, బార్‌ అసోసియేషన ప్రధాన కార్యదర్శి సకినాల వేలాద్రి పాల్గొన్నా రు. కక్షిదారులకు లయన్స క్లబ్‌ ఆధ్వర్యంలో పులిహోర ప్యాకెట్లు అందజేశారు.

Updated Date - Jun 08 , 2024 | 11:54 PM